సబ్జా గింజలతో మేలెంత? బరువును తగ్గించి.. మధుమేహాన్ని?

శుక్రవారం, 27 అక్టోబరు 2017 (12:43 IST)
సబ్జా గింజలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. చర్మ సమస్యలు.. చికెన్ ఫాక్స్ వచ్చిన వారికి శరీర తాపాన్ని తగ్గించుకోవచ్చు. శరీరం వేడి అయినట్లు భావిస్తే సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టి కొబ్బరి నీళ్ళలో కలిపి తాగితే మంచి ఫలితం వుంటుంది. అజీర్తితో ఇబ్బందులు చేసిన వారికి ఈ గింజలు నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. 
 
సబ్జా గింజలు నానబెట్టిన నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలు ఉంటాయి. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రి పూట తాగితే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. అలాగే మధుమేహాన్ని కూడా అదుపులో వుంచుతుంది.
 
సబ్జా గింజల గుజ్జును పైనాపిల్, యాపిల్ జ్యూస్‌లలో కలిపి పిల్లల చేత తాగిస్తే శరీరంలో వేడి తగ్గిపోతుంది. అదే ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది. మహిళలు బరువు తగ్గాలనుకుంటే సబ్జాను నానబెట్టిన నీటిని తాగితే మంచి ఫ‌లితం ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు