ప్రతి చిన్న విషయానికి మీకు కొపం వస్తుంటే దానికి కారణం ఏమిటని మీరు ఆలోచించారా? చాలా మంది చేసే పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం, చిరాకు పడటం, విసుగు చెందడం జరుగుతుంటుంది. నిద్రలేమితో బాధపడే వారిలో ఈ లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రి పూట సరిగ్గా నిద్రపోకపోతే దాని ప్రభావం మన ఆరోగ్యంపై బాగా పడుతుంది.
నిద్రలేమితో బాధపడేవారు అనుభవించే నరకం అంతా ఇంతా కాదు. పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారాణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఈ సమస్య కారణంగా మరో పెద్ద సమస్య వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
కనీసం ఏడు గంటలకు పైగా నిద్రపోయిన వారు సాధారణంగా ఉంటే, నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో చికాకు, కోపం కనిపించాయని తెలిపారు. అందుకే కంటినిండా నిద్రపోవాలి. దానితోపాటు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.