ఎండిన చేపలను ప్రోటీన్ ప్రధాన వనరుగా పరిగణించవచ్చు. కానీ చాలా తక్కువ మొత్తంలో కేలరీలను అందిస్తుంది. ఎండు చేపలు తినడం వల్ల బరువు పెరగరు అధిక-నాణ్యత ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఐకోసపెంటెనోయిక్ యాసిడ్, డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్‌తో సహా ఎండు చేపల్లో వుంటాయి.
అంతేకాదు అయోడిన్, జింక్, రాగి, సెలీనియం, కాల్షియం కూడా వుంటాయి. కనుక వారానికో లేదంటే పదిహేనురోజులకు ఒకసారైనా ఎదిగేపిల్లలకి ఎండు చేపలు పెట్టడం మంచిది.