కాకర కాయలో హైపోగ్లైసెమిక్ పదార్థాలుంటాయి. ఇవి రక్తం, మూత్రంలోని షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కాకరకాయ రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్ దరిచేరకుండా వుంటుంది. కాలేయం శుభ్రపడుతుంది. అంతేకాకుండా రక్తాన్ని శుభ్రపరచడంలో కాకరకాయ తోడ్పడుతుంది.
రక్తంలోని మలినాల వల్ల కలిగే దుష్ర్పభావాలను నివారిస్తుంది. కాకర రసంలో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడపున తాగితే అనారోగ్యం దరిచేరదు. కాకర ఆకుల నుంచి తీసిన మూడు టీ స్పూన్ల రసాన్ని, ఒక గ్లాసు మజ్జిగలో కలిపి ప్రతిరోజూ ఉదయం పరగడపున ఒక నెల రోజులపాటు తీసుకుంటే పైల్స్ సమస్య చాలా వరకూ తగ్గిపోతుంది.