భోజనం చేయగానే నిద్రపోతే...?

శనివారం, 26 మార్చి 2022 (23:53 IST)
భోజనం చేసాక ప్రతి ఒక్కరూ కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఆయుర్వేదంలో చెప్పబడింది. ప్రేగుల ఉద్రిక్త లక్షణంతో ఇబ్బందిపడే ప్రతి ఒక్కరూ భోజనం చేసాక వీలున్నప్పుడల్లా కొద్దిసేపు నేల మీద పడుకోవడం మంచిది. ఐతే ఈ సమయంలో నిద్రకు ఉపక్రమించడం అవసరం కాదు, మంచిది కూడా కాదు. వెల్లకిలా వీపు మీద లేద ఎడమ భుజం వైపుకి తిరిగి ఐదు నుంచి 10 నిమిషాల పాటు పడుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ సుఖంగా, సహజంగా మొదలవుతుంది.

 
భోజనం చేయడానికి ముందు కొద్ది నిమిషాలు స్థిరంగా కూర్చోవడం చాలామంది విషయంలో ఉపయోగరంగా వుంటుంది. భోజనం మొదలుపెట్టడానికి ముందు సుమారు ఐదు నిమిషాల పాటు మీరొక్కరే ప్రశాంతంగా కూర్చోవడానికి ప్రయత్నించాలి. అలాగే భోజనం ముగించాక కూడా చేయాలి. ఆ తర్వాతే మరే పనయినా ప్రారంభించాలి. ఈ మాత్రం సమయం వెచ్చించడం జీర్ణక్రియ విషయంలో ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు