చల్లని నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారని చాలామంది నమ్ముతుంటారు. అది నిజమా.. లేదా అబద్దమా.. అని తెలుసుకుందాం.. నిజమే.. ఎలా అంటే.. ప్రతిరోజూ చన్నీటితో స్నానం చేస్తే నెలరోజుల్లో అధిక బరువు తగ్గుతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా చల్లని నీటితో స్నానం చేస్తే జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని కొందరి మాట.. కానీ, అది నిజం కాదు.. చల్లని నీటితో స్నానం చేస్తేనే జలుబు, దగ్గు రావు.
ఎందుకంటే చల్లటి నీటిని స్నానం చేస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఈ నీరు శరీరానికి తగిలినప్పుడు అది రక్తప్రసరణ పెంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో అనారోగ్యాలతో పోరాడే తెల్ల రక్తకణాలు సంఖ్యను పెంచుతాయి. అలసట, ఒత్తిడిగా ఉన్నప్పుడు చల్లని నీటితో స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చన్నీటి స్నానం ఎంతో మంచిది.