108 కోట్ల ఓం నమో వెంకటేశాయ నామ లిఖిత యజ్ఞం ప్రారంభం..

సోమవారం, 8 జులై 2019 (08:54 IST)
నూట ఎనిమిది కోట్ల ఓమ్ నమో వేంకటేశాయ నామ లిఖిత మహా యజ్ఞ క్రతువు విజయవాడ నుంచి  ప్రారంభం అయ్యింది. పెనుమాకలోని శ్రీ వైష్ణవ మహా  దివ్య క్షే త్రం ఆధ్వర్యంలో శ్రీ రామా నుజ లక్ష్మీ శ్రీనివాస వాసవీ చారిటబుల్ ట్రస్టు ద్వారా  ఆదివారం సాయంత్రం  ఐటీఐ కాలేజీ సమీపంలోని  ట్రస్టు అధ్యక్షులు చలువాది మల్లికార్జునరావు, వెంకట నాగ రాజేశ్వరీ దంపతుల చేతుల మీదుగా శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

రాష్ట్రదేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే  మల్లాది విష్ణు ప్రారంభించారు. గత పన్నెండేళ్లుగా ప్రతి ఏటా నగరంలో  శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో  శ్రీ వెంకటేశ్వర స్వామీ కల్యాణ వేడుకలు నిర్వహిస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే నూతన ట్రస్టు ద్వారా ఇంటింటా వెంకటేశ్వర స్వామి కల్యాణ వేడుకలకు శ్రీకారం  చుట్టారు. తిరుమల వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం ఆగమోక్తంగా  పండితులు స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

రాష్ట్రంలోని వాడ వాడ, ఇంటింటా 108 స్వామి వారి కల్యాణ వేడుకలు నిర్వహించాలని కమిటీ సంకల్పించారు.అది పూర్తయ్యాక 108 అష్టోత్తర శత  కుండాత్మక మహా  యజ్ఞం 2022 వ సంవత్సరం లో నిర్వహించాలని నిర్ణయించారు.  అందులో భాగంగా సనాతన హైందవ ధర్మాన్ని విసృతం చేసేందుకు శ్రీవారి కళ్యాణి తరంగిణి రథయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే స్వామివారి కల్యాణ రధాన్ని ట్రస్టు అధ్యక్షులు చలువాది మల్లికార్జునరావు సిద్ధం చేశారు. ఈ నెల 14 వ  తేదీ స్వామివారి రథయాత్ర ప్రారంభం కానుంది. ఆదివారం జరిగిన స్వామివారి కల్యాణవేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన  ప్రసాద వితరణ ఏర్పాటు చేసారు. 
కార్యదర్శి ఆత్కూరి వెంకట రామ నరసింహారావు, కోశాధికారి కటకం చినవెంకట రామలింగేశ్వరరావు, ఛైర్మెన్ దూబగుంట్ల శ్రీనివాసరావు,సభ్యులు మామిడి లక్ష్మీ వెంకట కృష్ణారావు, గరిమెళ్ళ నానయ్య చౌదరి   ఉమామహేశ్వర గుప్తా,  విజయ గణపతి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు