నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు పుదీనా ఆకులు నమిలి తినాలి. పుదీనా రసం నీటిలో కలిపి పుక్కిలించాలి. ఎండిన ఆకులు పొడుముతో దంతధావన చేయాలి. దంతవ్యాధులకు పుదీనా మంచి ఔషధంగా పనిచేస్తుంది.
పుదీనాతో చేసిన మెంథాల్ దంత వ్యాధులపై మంచి ప్రభావం చూపిస్తుంది. ప్రతిరోజూ ఆకులు బాగా, ఎక్కువసేపు నమిలి తింటుంటే దంత సంబంధిత సమస్యలు తలెత్తవు.