'తాము మారిపోయామని, ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తామని' తాలిబన్లు తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మహిళలు మాత్రం తాలిబన్ల రాజ్యంలో తమ హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా మహిళల పట్ల తాలిబన్ల వైఖరి మారేట్లు కనపడట్లేదు.
తాజాగా అఫ్గాన్ తొలి మహిళా గవర్నర్ సలీమా మజారీని తాలిబన్లు బంధించినట్లు తెలుస్తోంది. తుపాకీ చేతబట్టి తమతో పోరాడిన ఆమెపై తాలిబన్లు పైచేయి సాధించినట్లు సమాచారం. కాగా అఫ్గనిస్తాన్‌లోని బల్ఖ్ ప్రావిన్స్ లోని చహర్ కింట్ జిల్లాకు చెందిన సలీమా అఫ్గన్ తొలితరం మహిళా గవర్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.