అగరాజ్యం అమెరికాను కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది. ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ప్రతి రోజూ వందలు, వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కోరనా వైరస్ కోరల్లో చిక్కిన దేశంగా అగ్రరాజ్యం అమెరికా నిలించింది. పైగా, ఈ వైరస్ బారినపడిన వారిని రక్షించలేని పరిస్థితి ఆ దేశ పాలకులు ఏర్పడింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న అమెరికా విద్యార్థులు, పౌరులు స్వదేశానికి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా, భారత్‌లో ఉంటున్న అమెరికా పౌరులు అందుకు ఏమాత్రం అంగీకరించడం లేదు. ఇపుడు మా దేశం కంటే ఇండియానే సురక్షితం. ఇక్కడ ఉంటేనే మా ప్రాణాలను దక్కించుకోగలమంటున్నారు.