బంగ్లాదేశ్‌లో దారుణం.. హోటల్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. 24 మంది సజీవ దహనం!!

వరుణ్

మంగళవారం, 6 ఆగస్టు 2024 (17:54 IST)
రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. ఆందోళనకారులు ఓ హోటల్‌కు నిప్పుపెట్టారు. దీంతో 24 మంది సజీవదహనమ్యయారు. మరికొందరు గాయపడ్డారు. దేశంలో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గత 21 రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. 
 
ఇవి తారాస్థాయికి చేరుకోవడంతో వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు వరకు 440 మంది చనిపోయారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ సైన్యం రంగంలోకి దిగి తీవ్రంగా కృషి చేస్తుంది. పైగా, దేశ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె దేశాన్ని వీడిన కొన్ని గంటల్లోనే వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ నేపథ్యంలో జషోర్ జిల్లాలో ఓ హోటల్‌కు మంగళవారం ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవదహనమయ్యారు. మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నారు. ఈ హోటల్ అవామీ లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి  షాహిన్ చక్లాదర్‌కు చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్‌ కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు