వాజ్‌పేయి అంత్యక్రియలు.. తరలివచ్చిన విదేశీ నేతలు.. భూటాన్ రాజు నివాళి

శుక్రవారం, 17 ఆగస్టు 2018 (16:28 IST)
దివంగత ప్రధాని వాజ్ పేయి అంత్యక్రియలు జరుగుతున్నాయి. స్మృతి స్థల్‌కు చేరుకున్న వాజ్‌పేయి పార్థవదేహానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఢిల్లీలోని దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సుమారు నాలుగు కిలోమీటర్ల మేర సాగింది. వాజ్ పేయి భౌతిక కాయానికి త్రివిధ దళాదిపతులు, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు తుది నివాళులర్పించారు. 
 
వాజ్ పేయి అంత్యక్రియలకు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఇక అటల్ జీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన నేతలు తరలివచ్చారు. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ మంత్రులు, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్ ఇప్పటికే చేరుకున్నారు. 
 
కాగా, వాజ్ పేయి మృతిపై ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా, రష్యా, బ్రిటన్, జపాన్ దేశాధినేతలు సంతాపం ప్రకటించారు. భారత్-అమెరికా సంబంధాలు మెరుగుపరచడంతో వాజ్ పేయి కీలకపాత్ర పోషించారని అమెరికా దౌత్య కార్యాలయం ఈ సందర్భంగా ప్రస్తావించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు