లారంగ్ ఘర్ బౌద్ధ అకాడమీని చూస్తే షాకవుతారు. చీమల పుట్టలా చిన్న చిన్న ఇళ్లు కనిపిస్తాయి. కొండ చివర్లో నిర్మించిన చెక్క ఇళ్లను చూసేందుకు రెండు కళ్లు ఏమాత్రం చాలవు. వాయువ్య చైనాలో పర్వత ప్రాంతంలోవున్న లారంగ్ గార్ బౌద్ధ అకాడమీ ప్రపంచం మొత్తమ్మీద అతి పెద్దదైన ఈ టిబెటన్ బౌద్ధారామంలో పదివేల మందికిపైగా బౌద్ధ సన్యాసులు, సాధువులు నివసిస్తుంటారు.
భూమికి 12,500 అడుగుల ఎత్తులో రఫ్ వాతావరణంలో నిర్మానుష్య ప్రాంతంలో బౌద్ధ భిక్షువులు నివాసముంటుంటారు. వీళ్ళ ఇళ్లన్నీ ఎరుపురంగులో ఉండి ఇరుకుగా ఒకదాని వెంట మరొకటి ఉండటంతో కొండ మీద రెడ్ సీ చూస్తున్న అనుభూతి కలుగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.