యెమెన్లో హౌతీ తీవ్రవాదులు జరిపిన క్షిపణి దాడిలో 17 మంది మృతిచెందారు. మరిబ్ నగరంలోని గ్యాస్ ప్లాంట్ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు.
యెమెన్లో హౌతీ తీవ్రవాదులు జరిపిన క్షిపణి దాడిలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి సైతం ఉందని ఆ దేశ సైన్యాధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడ్డట్లు పేర్కొన్నారు.
మరిబ్ నగరంలోని మరిబ్ నగరంలోని గ్యాస్ ప్లాంట్ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు వివరించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా డ్రోన్ల సాయంతో అంబులెన్సులపైనా దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.