కొలంబియాలో దారుణం.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన పదేళ్ల చిట్టితల్లి.. 26 రోజులుగా..?

శనివారం, 19 డిశెంబరు 2020 (10:18 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా పసి మొగ్గలను కూడా వదలడం లేదు మృగాళ్లు. ఆడుతూ పాడుతూ ఎదగాల్సిన చిన్నారులు అకృత్యాలకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో కొలంబియాలో దారుణం వెలుగు చూసింది. అమ్మ ప్రేమ, నాన్న గారం.. స్నేహితులు, ఆటలు తప్ప మరొకటి తెలియని పదేళ్ల చిన్నారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. గత 26రోజులుగా పసి గుడ్డును ఆ చిట్టితల్లి కాపాడుకుంటుంది. 
 
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. మరో దారుణం ఏంటంటే.. తనకు ఏం జరిగిందో.. ఎవరు తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో ఆ చిట్టితల్లి చెప్పలేకపోతుంది. ఎనిమిదో ఏట నుంచే చిన్నారిపై ఈ దాడి మొదలయ్యిందని అధికారులు భావిస్తున్నారు. ప్రాడో మున్సిపాలిటిలో నివసిస్తున్న బాలికను, ఆమె బిడ్డను ప్రస్తుతం ఇబాకో నగరంలోని మెడికల్‌ కేర్‌ సెంటర్‌లో ఉంచి సంరక్షిస్తున్నారు. 
 
బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని.. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులని అనుమానిస్తున్నాం. బాధితురాలి సవతి తండ్రి(43), అక్కడే పొలాల్లో పని చేసే మరో వ్యక్తి(23)ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. 
 
ఇకపోతే.. కొలంబియాలో అత్యాచారం, తల్లి ప్రాణానికి ప్రమాదం ఉన్న సందర్భాల్లో అబార్షన్‌ చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే చిన్నారి విషయంలో ఇది ఎందుకు పాటించలేదో తెలియడం లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు