మద్యంబారులో దుండగుడి కాల్పులు... పది మంది మృత్యువాత

మంగళవారం, 15 జూన్ 2021 (13:43 IST)
నేరాలు, ఘోరాలకు అడ్డాగా ఉండే నైజీరియా దేశంలో దారుణం జరిగింది. ఓ మద్యంబారులో దండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పది మంది మృత్యువాతపడ్డారు. వ్యానులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో సెంట్రల్ నైజీరియాలోని జోస్ సౌత్‌లోని బార్‌లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. 
 
ఈ కాల్పుల్లో 10 మంది మరణించారని నైజీరియా పోలీసు ప్రతినిధి ఉబాఒగాబా వెల్లడించారు. బార్‌లో కాల్పులు జరిపిన గన్‌మెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కాల్పుల సమాచారం అందగానే భద్రతా సిబ్బంది, అప్రమత్తమయ్యారని.. వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారని నైజీరియా పోలీసు అధికారి వెల్లడించారు.
 
అయితే.. ఇటీవల కాలంలో కాల్పుల సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 20 మంది వరకూ మరణించారు. ప్రస్తుతం బార్‌లో జరిగిన కాల్పుల సంఘటన నైజీరియాలో సంచలనం రేపింది. అయితే.. ఈ కాల్పుల వెనుక ఉగ్రవాద సంస్థలు ఉండే అవకాశముందని పలువురు వెల్లడిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు