బ్రిటన్‌లో లాక్డౌన్ ఆంక్షలు పొడగింపు.. ఎప్పటివరకు?

మంగళవారం, 15 జూన్ 2021 (08:00 IST)
బ్రిటన్ ప్రభుత్వం మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఆంక్షలను వచ్చే నెల 19వ తేదీ వరకు పొడగించింది. ఈ మేరకు బ్రిటిష్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ సోమవారం తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు ఈ నెల 21న ముగియనుండగా మరోసారి పొడగించారు. 
 
కరోనా డెల్డా వేరియంట్‌ సంక్రమణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎం వెల్లడించారు.ఆంక్షలు జూలై 19వ తేదీ వరకు అమలులో ఉంటాయని, ఆ తర్వాత పొడగించాల్సిన అవసరం ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు 40 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్‌ టీకా రెండో మోతాదును వేగవంతం చేస్తామన్నారు. ఇదిలావుండగా.. ఆదివారం బ్రిటన్‌లో కొత్తగా 7,490 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. ఎనిమిది మంది మరణించారు. వారం కిందటి కేసులతో పోలిస్తే గతవారం కేసుల్లో 49శాతం పెరుగుదల కనిపించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు