డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు.. నమ్ముతున్న అమెరికా జనం.. గెలుస్తారా?

సోమవారం, 31 అక్టోబరు 2016 (11:21 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వస్తున్న ఆరోపణలను జనం నమ్ముతున్నారని తాజా సర్వేలో తేలింది. మహిళలతో అనుచితంగా ప్రవర్తించారని వస్తున్న ఆరోపణలను ట్రంప్‌తో పాటు ఆయన ఫ్యామిలీ సభ్యులు ఖండిస్తున్న వేళ.. జనం మాత్రం ఆ ఆరోపణలను నిజమని నమ్ముతున్నారు. 
 
డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలను అమెరికన్లు నమ్ముతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. డొనాల్డ్ ట్రంప్ పై మహిళలు చేసిన ఆరోపణలను విశ్వసిస్తున్నామని ఏపీ-జీఎఫ్‌ కే సర్వేలో 70 శాతం మందిపైగా అమెరికన్లు వెల్లడించారు. ట్రంప్ మద్దతుదారుల్లో 35 శాతం మంది ఈ ఆరోపణలను నమ్ముతుండటం విశేషం. 
 
కాగా 2005లో ఓ వివాహితతో ట్రంప్ మాట్లాడిన ఆడియో టేపులు బయటకు రావడంతో అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేడెక్కిన సంగతి తెలిసిందే. హీరోయిన్లు, మోడల్స్‌తో పాటు 12 మంది అతనికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారా లేదా అనే దానిపై క్లారిటీ రావాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి