బైడెన్ గెలుపు చెల్లదని, ఈ ఎన్నికలు రద్దు చేయాంటూ ట్రంప్ మద్దతు దారులు పెద్ద యెత్తున నినాదాలు చేశారు. బారికేడ్లను దాటి.. కాంగ్రెస్‌లోకి దూసుకువచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకోగా..ఒక మహిళ మృతి చెందారు.
అయితే ట్రంప్ మద్దతు దారులను భద్రతా బలగాలు, పోలీసులు నియంత్రించారు. కాగా, ఈ ఘటనను కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఇది తిరుగుబాటు చర్యగా అభివర్ణించిన ఆయన..ఈ హింసాత్మక చర్యలు చల్లారాలంటే ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడాలని డిమాండ్ చేశారు.