తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్ 777-200 విమానం 231 మంది ప్రయాణికులు, పది మంది సిబ్బందితో డెన్వర్ నుంచి హోనొలుకు బయలుదేరింది. ఈ క్రమంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదివారం తెలిపింది.
అయితే, విమాన శకలాలు ఓ ఇంటి బయట చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ చిత్రాలను కొలరాడోలోని బ్రూమ్‌ఫీల్డ్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇంజిన్ కౌలింగ్, టర్ఫ్ ఫీల్డ్‌లోని భాగాలు ఉన్నాయి. అలాగే విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో కనిపించింది. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ స్టేఫీ బోర్డ్ (ఎన్‌టీఎస్‌బీ) తెలిపింది.