జర్నలిస్టులు నీతిమాలిన సంత అంటున్న ట్రంప్: మీవద్ద నీతులు నేర్చుకోమంటున్న మీడియా
మంగళవారం, 24 జనవరి 2017 (02:26 IST)
ఒకవైపు జర్నలిస్టులంత నీతిమాలిన సంత ఈ ప్రపంచంలోనే లేరంటూ ఎకసెక్కమాడుతున్న అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోవైపు మీ వద్ద నీతులు నేర్చుకోవలసిన ఖర్మ మాకుపట్టలేదని మండిపడుతున్న అమెరికన్ మీడియా. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్ర వైషమ్యపూరిత సంబంధాలు ఇరు పక్షాల మధ్య నెలకొన్న నేపధ్యంలో అమెరికన్ మీడియా తన భిన్నాభిప్రాయాలను, పోటీని పక్కనబెట్టి అధ్యక్షుడిని ఉద్దేశించి ఘాటైన ఉత్తరం రాసింది. అడుగడుగునా తనకు మీడియా అడ్డుతగులుతోందన్న కక్షతో అధ్యక్ష భవనం శ్వేతసౌధం నుంచి ప్రెస్ బృందాలను బయటకు పంపించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను మీడియా ఆ ఉత్తరంలో అపహాస్యం చేసింది.
ఈ పదవిలో మీరు మహా అంటే 8 సంవత్సరాలు మాత్రమే ఉండవచ్చు కానీ అమెరికా రిపబ్లిక్ ఏర్పడినప్పటినుంచి మీడియా ఉంటోందని, ఈ మహత్తర ప్రజాస్వామ్య వ్యవస్థలో అడుగడుగునా మా ఉనికిని నిరూపించకుంటూనే వస్తున్నామని, మా విలువను స్థరీకరించుకుంటూనే వస్తున్నామని ఆ లేఖలో మీడియా పేర్కొంది. వార్తల విషయంలో ప్రాథమిక సూత్రాలను నిర్దేశించాల్సింది మేమే తప్ప అది మీ బాధ్యత కాదు. అది మా ఎంపిక మాత్రమే. మీ నిబంధనలకు అంగీకరించని విలేకరులను సాగనంపుతానని మీరు భావిస్తుంటే మాత్రం, అది జరగని పని అంటూ ట్రంప్‌ను హెచ్చరించింది.
మా ప్రసారాలను, వార్తాకాలమ్‌లను ప్రభావితం చేయాలని మీరు భావిస్తుండవచ్చు. కానీ మా పాఠకులకు, శ్రోతలకు, వీక్షకులకు ఎంత ఉత్తమంగా సేవలందించాలో మేం నిర్ణయించుకుంటాం. ఆ పని మీది కాదు. వార్తల్లో నీతి లేదా న్యాయమైన వ్యాఖ్యల గురించి మాలో మాకు విభేదాలు ఉండవచ్చు. చర్చలు జరగవచ్చు కాని ఆ చర్చలను ప్రారంభించాల్సిందీ, ముగించాల్సిందీ కూడా మేమేనని మర్చిపోవద్దు అంటూ అమెరికన్ మీడియా ఆ లేఖలో మీడియా ప్రభావాన్ని ఏ అధ్యక్షుడూ ప్రభావితం చేయలేరని తేల్చి చెప్పింది. అధికార జులుంకి, పాలకుల అహంకారానికి తలొగ్గే స్వభావం మీడియా లక్షణం కాదని చాటి చెబుతున్న ఆ లేఖ క్లుప్త పాఠాన్ని ఇక్కడ చూడవచ్చు.
డియర్ మిస్టర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్..
గత కొన్ని రోజులుగా మీ ప్రెస్ కార్యదర్శి శ్వేతసౌధం నుంచి వార్తా మీడియా బృందాలను ఎలా సాగనంపాలా అని ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో మీ విశేషాలను కవర్ చేయడంపై మీరు ఆద్యంతం నిషేధించిన వైఖరికి ఇది తాజా ఉదాహరణ మాత్రమే. బహుశా మీకు అధ్యక్షుడిగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండవచ్చు. అయితే.. ప్రెస్‌తో ఎలా వ్యవహరించాలనే అంశంపై విధివిధానాలను నిర్ణయించుకోవడానికి మీకు పూర్తి హక్కు ఉన్నట్లే మాకు కూడా కొన్ని హక్కులున్నాయి. మా ప్రసారాలను, వార్తాకాలమ్‌లను ప్రభా వితం చేయాలని మీరు భావిస్తుండవచ్చు. కానీ మా పాఠకులకు, శ్రోతలకు, వీక్షకులకు ఎంత ఉత్తమంగా సేవలందించాలో మేం నిర్ణయించుకుంటాం. ఆ పని మీది కాదు.
మీ పాలనను పరిశీలించే అవకాశం విలేకరులకు ఇవ్వాలా లేదా అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. కానీ సమాచారాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో పొందడంలో మాకు విశేష అనుభవం ఉందని మీరు గుర్తించాలి. ఆఫ్‌ది రికార్డుగా చెబుతున్నాం. వార్తల విషయంలో ప్రా«థమిక సూత్రాలను నిర్దేశించాల్సింది మేమే తప్ప అది మీ బాధ్యత కాదు. అది మా ఎంపిక మాత్రమే. మీ నిబం ధనలకు అంగీకరించని విలేకరులను సాగనంపుతానని మీరు భావిస్తుంటే మాత్రం, అది జరగని పని.
మమ్మల్ని మీరు బయటకు పంపినప్పటికీ మీ అభిప్రాయాలను సేకరించడానికి మేం ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ సత్యాన్ని పదే పదే వక్రీకరిస్తున్న, లొంగ దీసుకుంటున్న వ్యక్తులకు మా ప్రసారాలను, వార్తా కాల మ్‌లను కట్టబెడతామని దీనర్థంకాదు. రాజకీయ రంగంలో మీడియా పట్ల అవిశ్వాసాన్ని తీవ్రస్థాయిలో ప్రచారం చేసిన ఘనత మీదేనని గుర్తి స్తున్నాం. కానీ దాన్ని మేమొక ముందస్తు హెచ్చరికగా తీసుకుంటాం. మా పట్ల విశ్వాసాన్ని తిరిగి పొందుతాం. మా తప్పుల్ని గుర్తించడం ద్వారా, మాకు మేము నిర్దేశిం చుకున్న నైతిక ప్రమాణాలకు కట్టుబడటం ద్వారా కచ్చిత మైన రిపోర్టింగ్ ద్వారా మేం ముందుకు వస్తాం.
మీరు మమ్మల్ని ఇన్నాళ్లుగా విభజించడానికి ప్రయ త్నించారు. ఆ రోజులు గతించాయి. మీ వార్తలను కవర్ చేయడంలో ఉన్న సవాలును ఎదుర్కొనడానికి వీలైన చోటల్లా మేం పరస్పరం సహకరించుకుంటాం. ఇకపై మీరు ఇష్టపడని అంశాలను ప్రస్తావించిన రిపోర్టర్‌ని నోరు మూయించడానికి ప్రయత్నిస్తే మీరొక ఐక్య సంఘటననే ఎదుర్కొనాల్సి వస్తుంది. వార్తల్లో నీతి లేదా న్యాయమైన వ్యాఖ్యల గురించి మాలో మాకు విభేదాలు ఉండవచ్చు. చర్చలు జరగవచ్చు కాని ఆ చర్చలను ప్రారంభించా ల్సిందీ, ముగించాల్సిందీ కూడా మేమేనని మర్చిపోవద్దు.
చివరిగా.. మేం దీర్ఘకాలం నుంచి ఈ క్రీడను ఆడు తున్నాం. మీరు మీ పనిలో మరో 8 ఏళ్లు కొనసాగవచ్చు. కాని మేం మాత్రం అమెరికన్ రిపబ్లిక్ స్థాపన నాటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ మహత్తర ప్రజాస్వామ్యంలో మా పాత్రను పదేపదే స్థిరపర్చుకున్నాం. మేం ఎవరం, ఎందుకు ఇక్కడ ఉన్నాం అనే మౌలిక ప్రశ్నల గురించి ఆలోచించుకునేలా మీరు మమ్మల్ని ఒత్తిడికి గురిచేశారు. అందుకు మీకు మేం కృతజ్ఞులమై ఉంటాం.
-వైట్ హౌస్‌లో అధ్యక్షుడి దైనందిన వ్యవహారాలను రిపోర్ట్ చేసే ప్రెస్ కోర్