ట్వంటీ-20 ఫార్మాట్‌కు ధోనీ ఏమాత్రం పనికిరాడని చెప్పిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అదే మాటను నిజం చేశాడు. తన డ్రీమ్ ఐపీఎల్ జట్టును సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. ఈ జట్టులో మహేంద్ర సింగ్ ధోనికి గంగూలీ చోటు కల్పించలేదు. మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు గంగూలీ స్థానం కల్పించాడు.
ఇంకా గంగూలీ డ్రీమ్ జట్టులో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి ఏబీ డివిలియర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి సునీల్ నరేన్, ఢిల్లీ జట్టు నుంచి క్రిస్ మోరిస్‌లకు చోటు కల్పించాడు. ఓపెనర్లుగా కెప్టెన్లు విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్‌లను బెంగాల్ దాదా ఎంచుకున్నారు.
దీనిపై గంగూలీ స్పందిస్తూ.. తన డ్రీమ్ జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకు చోటు కల్పించినట్లు తెలిపాడు. ఎంతగానో ఆలోచించి.. కీలక మార్పుల ద్వారా ఐపీఎల్ డ్రీమ్ టీమ్‌ను ప్రకటిస్తున్నట్లు గంగూలీ పేర్కొన్నాడు. ఇక గంగూలీ ఐపీఎల్ డ్రీమ్ టీమ్ జట్టులో... విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, డివిలియర్స్, స్టీవ్ స్మిత్, నితీష్ రానా, మనీష్ పాండే, రిషబ్ పంత్, సునీల్ నరైన్, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్‌లకు స్థానం లభించింది.