సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా మారనున్న ఫ్లిఫ్ కార్ట్ సీఈవో.. ఐఫోన్ 7దే అగ్రస్థానం..

శుక్రవారం, 7 అక్టోబరు 2016 (16:37 IST)
రిలయన్స్ జియో ప్రభావంతో 4జీ మొబైళ్ల అమ్మకం జోరందుకుంది. 4జీ సేవలను మూడు మాసాలు జియో ఉచితంగా ప్రకటించడంతో వినియోగదారులు 4జీ మొబైళ్లను పోటాపోటీగా కొనేస్తున్నారు. ఈ మొబైళ్ల కొనుగోలు అత్యధిక శాతం ఆన్‌లైన్‌లో జరుగుతోంది. దీంతో భారత్‌లోని ఈ-కామర్స్ దిగ్గజాల్లో పోటీ పెరిగిపోతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. 
 
ఇలా ఈ-కామర్స్ మొబైళ్ల విక్రయంలో ఫ్లిప్ కార్ట్ ముందుంది. ఈ పండుగ సీజన్‌లో ఫ్లిఫ్ కార్ట్ అమ్మకాల్లో ఐఫోన్ 7 మోడలే అగ్రస్థానంలో నిలిచింది. యాపిల్ ఐఫోన్ 7 అమ్మకాలను పెంచుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా మారబోతున్నారు. 
 
శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఫ్లిప్‌కార్ట్ సీఈవో డోర్ డెలివరీ ద్వారా సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లా వెళ్లి ఫస్ట్ ఆర్డర్ చేసిన వ్యక్తికి ఐఫోన్ 7ను అందించనున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ కొన్నవారికి ఫ్లిప్‌కార్ట్ సర్‌ప్రైజ్ కూడా ఇవ్వనుందట. అమ్మకాలు పెంచుకోవడానికి, వినియోగదారులను ఆకర్షించడానికి ఫ్లిప్‌కార్ట్ ఈ డోర్ డెలివరీ స్ట్రాటజీని అమలు చేస్తోందని ఐటీ నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి