అతి ఎప్పుడూ మంచిది కాదు.. ముఖ్యంగా పిల్లల్లో..!!

FILE
* ఎదురు సమాధానాలు చెప్పడం, తాము అనుకున్నది జరగకపోతే బిగ్గరగా ఏడవడం, చేతికందిన వస్తువుల్ని విసిరి కొట్టడం, కాళ్ళను నేలతో తన్నడం, మూర్ఖంగా వాదించడం లాంటి లక్షణాలు కొంత మంది పిల్లల్లో ఉంటాయి. ఇలాంటి వారిపై తల్లిదండ్రులు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* తమ ఇష్టప్రకారమే అన్ని పనులు జరగాలన్న కోరిక ప్రతి చిన్నారిలోనూ ఉంటుంది, అది సహజం. అయితే పరిస్థితుల్ని అర్ధం చేసుకోకుండా, ప్రతి విషయంలోనూ మొండిపట్టు పట్టడం మంచి లక్షణం కాదు. పిల్లల్లో కనిపించే ఇలాంటి విపరీత ధోరణులే భవిష్యత్తులో ప్రమాదకరమైన అలవాట్లుగా మారతాయి. పిల్లల్లో కనిపించే 'అతి' ధోరణుల్ని మొదట్లోనే గమనించి, వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ప్రత్యేకించి తల్లులు ఈ విషయంలో ముఖ్యపాత్రను పోషించాలి.

* చిన్నతనంలో మాట్లాడే 'ముద్దు' మాటలే, ఎవరూ పట్టించుకోకపోతే ''ముదురు'' మాటలు అవుతాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దల మాటలకు ఎదురు తిరిగే నైజం పిల్లల్లో ఎలా వృద్ధి చెందుతుందో తెలుసుకుని, ముందుగానే జాగ్రత్తపడి, వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదే. పిల్లలు మొండిగా మారడానికి, వారిలో అహంభావం పెరగడానికి తల్లిదండ్రుల ఉదాసీన వైఖరే కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి కూడా.

వెబ్దునియా పై చదవండి