ఇవి మీకు తెలుసా...?!

మంగళవారం, 11 నవంబరు 2008 (12:43 IST)
ప్రశ్నలు :
1. దేశంలో మొట్టమొదటి గిరిజన విశ్వవిద్యాలయం ఏది?

2. 2008వ సంవత్సరాన్ని విద్యా సంవత్సరంగా ప్రకటించిన రాష్ట్రం ఏది?

3. కామన్వెల్త్ క్రీడలను ఎక్కడ నిర్వహిస్తారు?

4. ఐక్యరాజ్యసమితి 2008ని ఏ సంవత్సరంగా ప్రకటించింది?

5. కాంబోడియా ప్రభుత్వం ఇటీవల ఏ భారతీయ శాస్త్రవేత్తను "సహమైత్రీయ" అవార్డుతో సత్కరించింది?

6. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్యం అందించే ఉద్దేశ్యంతో ప్రారంభమైన నడిచే రైలు ఆసుపత్రి పేరేంటి?

7. తొలిసారిగా ఆర్కిటిక్‌కు వెళ్లిన భారత్ బృందానికి నేతృత్వం వహించినవారి పేరేంటి?

8. "వన్‌మోర్ ఓవర్" అనే రచన ఎవరి ఆత్మకథ?

జవాబులు :
1. భువనేశ్వర్‌లోని "ద కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్"
2. హర్యానా
3. గ్లాస్గోవ్
4. పారిశుధ్ధ్య సంవత్సరం
5. డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్
6. లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్
7. రసిక్ రవీంద్ర
8. ప్రసన్న

వెబ్దునియా పై చదవండి