దేశాన్ని ఓ కుదుపు కుదిపిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో ఈనెల 21వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెలువరించనుంది. ఈ విషయాన్ని ఇవాళ ఢిల్లీలోని పాటియాలా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ షైనీ ప్రకటించారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఏ.రాజా, డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు.
దీనిపై ఆమె స్పందిస్తూ, తుది తీర్పు కోసం డిసెంబర్ 21 వరకు వేచి చూద్దామన్నారు. గతంలో అనేక సార్లు ఈ కేసు వాయిదా పడింది. నవంబర్ 7వ తేదీన చివరి విచారణ జరిగింది. అయితే ఆ విచారణలో తుది తీర్పు తేదీని డిసెంబర్ 5వ తేదీన వెల్లడిస్తామని కోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ తుది తీర్పును ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో రాజా, కనిమొళితో పాటు మరో 19 మందిపై 2014లో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.