కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఉద్యోగులకు డీఏ పెంపు

శనివారం, 25 మార్చి 2023 (13:02 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు డీఏ పెంచింది. ఉద్యోగులందరికీ 4 శాతం కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు ఇచ్చే డీఏను 38 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. 2023 జనవరి 1 నుంచే పెరిగిన డీఏ అమలు కానుంది. 
 
పెరుగుతున్న ధరల నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులకు ఊరటగా కేంద్రం డీఏను ఇస్తోంది. వినియోగ ధరల పట్టీ ఆధారంగా కేంద్రం డీఏను లెక్కిస్తుంది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు