ఆగస్టులో రూ.6.40 లక్షల కోట్ల డిజిటల్‌ చెల్లింపులు

శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:54 IST)
దేశంలో డిజిటల్‌ చెల్లింపులు రికార్డ్‌ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అన్ని డిజిటల్‌ యాప్‌ల నుంచి రూ.6.39 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పిసిఐ) వెల్లడించింది.

ఈ ఒక్క మాసంలోనే సుమారు 350 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఇంతక్రితం జులై మాసంతో పోల్చితే లావాదేవీల్లో 9.5 శాతం పెరుగుదల, విలువలో 5.4 శాతం వృద్థి చోటు చేసుకుంది.

దేశంలో 2016లో యుపిఐ సేవలు అందుబాటులోకి రాగా.. నోట్ల రద్దు, కరోనా ఆంక్షలతో చెల్లింపులు అమాంతం పెరిగాయి. భారత్‌లో మొత్తం 50 థర్డ్‌పార్టీ యుపిఐ యాప్‌లు పని చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు