భార్య - అత్త వేధింపులు తాళలేక బెంగాలీ నటుడు సూసైడ్ అటెంప్ట్

బుధవారం, 10 ఆగస్టు 2022 (11:18 IST)
Saibal Bhattacharya
బెంగాలీ నటుల ఆత్మహత్యల పరంపరం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నటీనటులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా మరో నటుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య, అత్తమామల వేధింపులు భరించలేక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు అతను పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ప్రాణపాయ స్థితిలో చిత్తరంజన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాయిబాల్ భట్టాచార్య అనే అనే బెంగాలీ నటుడు సోమవారం రాత్రి కస్బాలోని తన నివాసంలోనే బలవన్మరణానికి యత్నించారు. మద్యంమత్తులో భట్టాచార్య తనను తాను గాయపరుచుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు తక్షణం ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, ఈయన ఆత్మహత్యకు యత్నించడానికి ముందు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో షేర్ చేశారు. తాను ఈ తరహా నిర్ణయం తీసుకోవడానికి కారణం తన భార్యేనని చెప్పారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు