సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సీబీఎస్ఈడాట్ఎన్ఐసిడాట్ఇన్, సీబీఎస్ఈరిజల్ట్స్‌డాట్ఎన్‌ఐసిడాట్ఇన్ అనే వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చు. సీబీఎస్ఈ బోర్డ్ పదో తరగతి పరీక్షలు జరిగి 38 రోజుల్లోనే ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా విడుదల చేసింది.
కాగా పరీక్షా ఫలితాల్లో జాప్యం వల్ల విద్యార్థుల అడ్మిషన్లలో కూడా జాప్యం ఏర్పడుతుందని.. అందుకే ఇంటర్, పదో తరగతి పరీక్షా ఫలితాలను పరీక్షలు జరిగిన 30 రోజుల్లోనే విడుదల చేయడం జరిగిందని సీబీఎస్ఈ ఓ ప్రకటనలో వెల్లడించింది.
పరీక్షా ఫలితాలు ముందుగా విడుదల కావడం ద్వారా విద్యార్థులకు రీ-వాల్యూషన్‌కు సమయం వుంటుంది. ఆపై కళాశాలలో అడ్మిషన్ల కోసం, ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థులకు అవకాశముంటుందని సీబీఎస్ఈ వెల్లడించింది.