అంతులేకుండా పోయిన ఆప్, కమలనాథులదే ఢిల్లీ పీఠం

ఐవీఆర్

శనివారం, 8 ఫిబ్రవరి 2025 (11:49 IST)
Delhi Assembly results ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఆ పార్టీ 45 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుండగా ఆప్ కేవలం 25 చోట్ల ఆధిక్యంలో వుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగే ఖాతాను తెరవలేకపోతోంది. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 36 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌ను భాజపా దాటేసింది. దీనితో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
 
మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో వున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుండి అరవింద్ కేజ్రీవాల్, భారతీయ జనతా పార్టీ (BJP) నుండి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, భారత జాతీయ కాంగ్రెస్ (INC) నుండి సందీప్ దీక్షిత్ వంటి కీలక అభ్యర్థులు పోటీలో వున్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామని, అరవింద్ కేజ్రీవాల్ నాల్గవసారి ముఖ్యమంత్రి అవుతారని AAP ధీమా వ్యక్తం చేసింది. కానీ అగ్ర నాయకులు, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ముఖ్యమంత్రి అతిషి తమ తమ స్థానాల్లో వెనుకబడి ఉన్నారని ప్రారంభ ధోరణులు సూచిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు