డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరణానికి కారణమైతే ఏడేళ్ళ జైలు.. కేంద్రం కొత్త చట్టం

శనివారం, 23 డిశెంబరు 2017 (16:35 IST)
ఇకపై మద్యం సేవించి వాహనం నడుపుతూ వ్యక్తి మరణానికి కారణమైతే ఏడేళ్ళ జైలు శిక్ష పడనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న చట్టంలో మార్పులు చేసి కొత్త చట్టాన్ని రూపొందించనుంది. 
 
ఇపుడు తాగి మద్యం సేవించి రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మరణానికి కారణమైతే పాత చట్టం ప్రకారం రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండు కలిపి ఉండేవి. అయితే ఈ జైలు శిక్షను ఏడేళ్లు చేసేందుకు కేంద్ర రవాణాశాఖ సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు కూడా పలుమార్లు దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శిక్షలను కఠినతరం చేయాలని సలహా ఇచ్చింది కూడా. 
 
ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరణానికి కారణమైతే హత్యగానే పరిగణించి.. పదేళ్ల జైలు శిక్ష వేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా సూచన చేసింది. అయితే, అన్ని అంశాలను సమీక్షించిన కేంద్ర రవాణాశాఖ ఈ శిక్షను ఏడేళ్లుగా చేయాలని భావిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు