గుజరాత్ రాష్ట్ర చేపగా ఘోల్ ఫిష్‌.. స్పెషాలిటీ ఏంటంటే?

బుధవారం, 22 నవంబరు 2023 (12:01 IST)
fish
ఘోల్ ఫిష్‌ను గుజరాత్ రాష్ట్ర చేపగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు. భారత్‌లోని అతిపెద్ద చేపల్లో ఘోల్ చేప కూడా ఒకటి. గుజరాత్, మహారాష్ట్రలోని సముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. ఈ చేపకు విపరీతమైన డిమాండ్ వుంది. 
 
బీర్, వైన్ తయారీలో దీనిని ఉపయోగిస్తారు. దీనిని మూత్రపు తిత్తులును ఔషధాల్లో ఉపయోగిస్తారు. ముంబై నుంచి ఎయిర్ బ్లాడర్ విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది. ఈ చేప పొడవు దాదాపు మీటరున్నర ఉంటుంది. పొడవును బట్టి ఒక్కో చేప ధర రూ. 5 లక్షల వరకు పలుకుతుంది. 
 
గుజరాత్, మహారాష్ట్రలోని సముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. అలాంటి ఈ అరుదైన చేపను గుజరాత్ రాష్ట్ర చేపగా అహ్మదాబాద్‌లో జరిగిన రెండు రోజుల గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్‌లో సీఎం ప్రకటన చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు