ఇకపై విమానాశ్రయాల్లో మూత్రం నిల్వ చేయనున్నారు. ఈ ఐడియా ఇచ్చింది సాక్షాత్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అయితే, ఆయన ఆలోచన వెనుక భారీ ప్రణాళికే ఉంది. అదేంటంటే.. మనుషుల మూత్రం నుంచి యూరియా తయారు చేయవచ్చన్నది ఆయన ఆలోచన.
సహజ వ్యర్థాల నుంచి జీవ ఇంధనాలను ఎలా తయారు చేయొచ్చో గడ్కరీ వివరించారు. మనుషుల మూత్రంతోనూ జీవ ఇంధనం తయారు చేయవచ్చని చెప్పారు. మనిషి మూత్రంలో అమోనియం సల్ఫేట్, నైట్రోజన్‌లను వెలికి తీయొచ్చన్నారు. అందుకే ఎయిర్‌పోర్ట్‌లలో మూత్రాన్ని నిల్వ చేయమని సూచన చేసినట్టు చెప్పారు.