ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్ పరిధి తప్తపాణి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. సంఘటన స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.