Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

సెల్వి

గురువారం, 24 ఏప్రియల్ 2025 (12:23 IST)
X Account
పహల్గమ్ ఉగ్రదాడి వెనుకున్న పాకిస్థాన్ భారత్ మరో షాకిచ్చింది. భారత్‌లో పాక్ ప్రభుత్వ ట్విట్టర్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అకౌంట్‌ను నిరవధికంగా నిలుపుదల చేసింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఈ ఖాతాను భారత్‌లో నిలిపివేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, సామాజిక మాధ్యమ సంస్థ ఎక్స్‌ను అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఎక్స్ పాక్ ప్రభుత్వ ఖాతాను భారత్‌లో సస్పెండ్ చేసింది. దీంతో అందులోని కంటెంట్‌ను ఇక్కడి యూజర్లు చూడలేరు. 
 
ఇకపోతే.. అమాయకుల ప్రాణాలను బలిదీసుకున్న ఘటన వెనక సూత్రధారి అయిన పాక్‌పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన చర్యలు అవలంబించింది. సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలుపుదల చేయడంతో పాటు పాక్ దౌత్య సిబ్బందిని దేశం వీడాలని ఆదేశించింది.  
 
మరోవైపు, సార్క్ వీసా మినహాయింపు పథకం నుంచి కూడా పాక్ జాతీయులను భారత్ తప్పించింది. ఇప్పటికే ఈ వీసాప భారత్‌లో ఉన్న వారు దేశాన్ని వీడాలంటూ 48 గంటల గడువు విధించింది. అట్టారీ వాఘా సరిహద్దు చెక్ పోస్టును కూడా తక్షణం మూసేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు