ప్రధాన మంత్రి మోదీని కలిసిన ఏఎన్నార్ ఫ్యామిలీ.. బహుమతిగా కొండపల్లి బొమ్మ

సెల్వి

శనివారం, 8 ఫిబ్రవరి 2025 (10:51 IST)
modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నాగచైతన్య, శోభిత దంపతులు కలిశారు. ఈ సందర్భంగా శోభిత ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సాంప్రదాయ కొండపల్లి బొమ్మ (నృత్య బొమ్మ)ను బహుకరించారు. ప్రధాన మంత్రిని కలిసే  అవకాశం ఇచ్చినందుకు ఈ జంట మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 
 
అలాగే కళామతల్లికి తన తండ్రి చేసిన సేవను ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించడం తమకు తమ కుటుంబానికి అక్కినేని అభిమానులకు భారతీయ సినీ ప్రేక్షకులకు ఒక విలువైన ఆభరణం లాంటిదని నాగార్జున తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ చిహ్నాన్ని సైతం మోదీకి నాగార్జున అమల దంపతులు అందజేశారు. 
 
ఈ సందర్భంగా వారు దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు నివాళులర్పించారు. భారత సినిమాకు ఏఎన్నార్ చేసిన అపురూప కృషిని గుర్తిస్తూ, "అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వం" అనే నివాళిని పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అందజేశారు.
 
ఈ సందర్భంగా శోభిత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మోడీతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఏఎన్నార్‌ గారి సినిమా వారసత్వానికి నివాళిగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాసిన "అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ"ను ప్రదానం చేయడం గౌరవంగా ఉందని చెప్పింది.

ఏఎన్నార్ జీవిత కృషికి మీరు చేసిన గుర్తింపు మా కుటుంబం, అభిమానులు, భారతీయ సినీ ప్రేమికులకు ఒక విలువైన ధృవీకరణలాంటిదని కామెంట్లు చేసింది. ఇంకా #ANRLegacy #IndianCinema #ANRLivesOn అంటూ శోభిత వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు