పామును తినేందుకు ప్రయత్నించిన వ్యక్తి మృతి

ఆదివారం, 5 మే 2019 (16:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి పామును తినేందుకు ప్రయత్నించి మృత్యుపాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని మహీసాగర్ జిల్లాలోని అజన్వా గ్రామానికి చెందిన పర్వాత్ గాలా బరియా (70) అనే వ్యక్తి పొలానికి వెళ్లాడు. అపుడు పాము తోకను తొక్కడంతో అది కాటేసింది. 
 
దీంతో ఆగ్రహానికి గురైన బరియా పామును పట్టుకుని, దాన్ని తినే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బరియా అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానికులు బరియాను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. బరియా బంధువులు పామును చంపారు. ఈ విచిత్ర సంఘటన యూపీలో సంచలనమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు