ఢిల్లీలో భార్యను తాకట్టు పెట్టిన ఘనుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

శనివారం, 11 నవంబరు 2023 (14:55 IST)
పాండవులు పాంచాలీని జూదంలో పెట్టినట్లు నవయుగంలోనూ అదే ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త జూదంలో ఓడిపోయి భార్యను తాకట్టు పెట్టాడు. ఓ రైతు తన కూతురికి మూడేళ్ల క్రితం పెళ్లి చేయగా.. రూ.15 లక్షల కట్నం ఇవ్వాలని ఆ శాడిస్ట్ భర్త వేధించేవాడు. 
 
తాజాగా జూదంలో ఓడిపోవడంతో భార్యను తాకట్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత సోదరుడు ఆమెను కాపాడాడు. ఆపై భర్త ఇంటికి తీసుకెళ్లగా.. ఆమె తనకు వద్దని బయటకు గెంటేశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు