బెజవాడ కనకదుర్గ సన్నిధిలో మంగళవారం నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు విజయదశమి (ఈ నెల 24) వరకూ జరుగుతాయి. ఈరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు.
ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారు 9 రోజులు 9 రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవిగా దర్శనమిస్తున్నారు.
మంగళవారం తెల్లవారుజామున పూజులు నిర్వహించి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి కుంకుమ పూజ నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రేపటి తెల్లవారు జాము నుంచి రాత్రి 11 గంటల వరకూ దర్శనం కల్పిస్తారు.