అల్‌ఖైదా ముప్పు తొలగడం లేదు: ఒబామా

అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ నుంచి అమెరికాకు ముప్పు తొలగిపోవడం లేదని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా తెలిపారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ముప్పు తొలగిపోయేందుకు తీవ్రవాద మౌళిక సదుపాయాలు ఎక్కడవున్నా, వాటిని నాశనం చేయడం ఎంతో ముఖ్యమన్నారు.

అమెరికా పర్యటనకు విచ్చేసిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కెవిన్ రూడ్‌‍తో కలిసి వైట్‌‌హౌ‌స్ వద్ద సంయుక్త విలేకరుల సమావేశంలో బరాక్ ఒబామా మాట్లాడుతూ.. ఈ విషయాలు వెల్లడించారు. తీవ్రవాదంపై పోరు క్లిష్టమైన అంశం. తీవ్రవాదాన్ని అరికట్టేందుకు, దానిపైనే దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని, అందుకు సమర్థవంతమైన సమన్వయ ప్రణాళిక కావాలని ఒబామా పేర్కొన్నారు.

అల్‌ఖైదా, ఇతర అనుబంధ సంస్థల నుంచి ముప్పు వీడిపోవడం లేదు. తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్నారు. ఈ సమస్యను మిలటరీ చర్యలతోనే పరిష్కరించలేమని గుర్తించారు. దౌత్యపరంగానూ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దౌత్యపరమైన మార్గాలపై ఎక్కువగా దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి