ధనుస్సు లగ్నంలో జన్మించిన మీన, ధనుస్సు రాశి జాతకుల ఫలాలు :
ధనుస్సు రాశి: ధనుస్సు లగ్నంలో జన్మించిన ధనుస్సు రాశి జాతకులు అష్టమాధిపతిగా చంద్రుని ఆధిపత్యం లగ్నంలో ఉండటంతో మంచి యోగ ఫలాలను ప్రసాదిస్తాడు. ఇతరులను ఆకర్షించే విధమైన దేహసౌందర్యం, ఐశ్వర్య జీవితం గడుపుతారు. బంధువులకు ఆదరణగా ఉంటారు.
ఇతరులకు సహకరించే మనస్సు కలిగి ఉంటారు. నీతి నిజాయితీలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక పరంగా ఇతరులు గౌరవించే స్థాయిలో ఉంటారు. గురుప్రభావం చేత గృహనిర్మాణం, భూ స్థలాలను కొనటం వంటి వాటిలోఆసక్తి చూపుతారు.శుభ కార్యాలు వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. జీవితంలో సకల సంతోషాలు వీరికి చెంతనే ఉంటాయి.
మీనరాశి జాతకులు: ధనుస్సు లగ్నంలో పుట్టిన మీన రాశి జాతకులు అష్టస్థానాధిపతైన చంద్రగ్రహం నాలుగవ స్థానంలో ఆధిపత్యం వహించడంతో మంచి యోగాలు లభిస్తాయి. దీనితో పాటు గురుగ్రహ ప్రభావం చేత శుభకార్యాలు కుటుంబంలో జరుగుతాయి. ఈ జాతకులకు పూర్తి ఆయుర్దాయం కలిగి ఉంటారు. వ్యాధులు దరికి చేరవు. తల్లి వద్ద ప్రేమానురాగంతో ప్రవర్తిస్తారు.
వాహనాలు కొనడం, ఇంటి నిర్మాణం వంటి కార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతాయి. భవిష్యత్తులో పురోగమనం వైపు పయనించడానికి పలు ప్రయత్నాలు చేపడతారు. అధికారం చెలాయించే విధంగాను, ఇతరులు గౌరవించే విధంగా ఉంటారు. నీతి, నిజాయితీలకు అధిక ప్రాధాన్యత నిస్తారు. శుక్ర, గురు ప్రభావంతో భవిష్యత్తు ప్రగతి పథంలో నడుస్తుందని జ్యోతిష్కులు పేర్కొంటున్నారు.