మంగళవారం పూట వచ్చే ప్రదోషాన్ని భౌమ ప్రదోషం అంటారు. మంగళవారం త్రయోదశి తిథి, శుక్ల లేదా కృష్ణ పక్షంలో వచ్చేరోజును భౌమ ప్రదోషం అంటారు. ఈ మంగళవారం వచ్చే ప్రదోషం రోజున సాయంత్రం 4.30 గంటల నుంచి ఆరు గంటల వరకు శివాలయాల్లో జరిగే అభిషేకంలో పాల్గొనడం చేయాలి. ఇంకా పాలతో శివునికి అభిషేకం చేయిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ రోజున ప్రదోషకాలంలో శివుని ఆలయాల్లో నేతితో దీపమెలిగించే వారికి ఈతిబాధలుండవు.
అలాగే పాలు, పెరుగు, తేనె, పంచదార, గంగాజలం, నేతితో శివునికి అభిషేకం చేయాలి. లేకుంటే స్వచ్ఛమైన నీటితో శివుని లింగానికి అభిషేకం చేయించడం ద్వారా సకల పాపాలు హరించుకుపోతాయి. ప్రదోషకాలంలో ''ఓం నమశివాయః'' అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. 1, 11, 27, 108 బిల్వదళాలతో శివుడికి అర్చన చేయాలి. చందనం, రోజ్ వాటర్, అత్తరుతో శివునికి అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయి.
ఇంకా ''ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్" అనే మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే.. సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇంకా మంగళవారం హనుమంతునికి ప్రీతికరమైన వారం. ఇంకా హనుమంతుడు.. శివాంశంతో పుట్టడం ద్వారా మంగళవారం వచ్చే ప్రదోషం మహిమాన్వితమైనది.