ఇక కాలభైరవుని పూజ ఎలా చేయాలంటే.. వరుసగా ఐదు బుధవారాలు నిష్ఠగా పూజించాలి. మాంసాహారం ముట్టకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. బుధవారం రోజున సమీపంలోని కాలభైరవుడు లేదా స్వర్ణ ఆకర్షణ భైరవుని సన్నిధికి వెళ్లాలి. రెండు నేతి దీపాలను ఆలయంలో వెలిగించి, పావు కేజీ డైమండ్ కలకండను సమర్పించుకోవాలి. తర్వాత కాలభైరవుని వద్దే కూర్చుని ప్రార్థన చేయాలి.