పరిమళభరితమైన పుష్పములు చేత గాని లేదా మాల చేతగాని శివలింగమును విశేషముగా అలంకరించి పూజ చేస్తారో అట్టివారు అనంత ఫలమును పొందెదరు. రుద్రాక్ష పూలతో శివుని పూజిస్తే పని లో ఎన్ని అడ్డంకులు ఉన్నా చివరకు విజయం వారిదే అవుతుంది. తుమ్మిపూలతో ఈశ్వరుని పూజిస్తే భక్తి ఎక్కువ అవుతుంది. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే సుఖ శాంతులు కలుగుతాయి