ఏపీలో మరికొత్త జిల్లాలు.. పాత జిల్లాల పునర్విభజన చేస్తారా

ఠాగూర్

బుధవారం, 21 మే 2025 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. అలాగే, గత వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. దీంతో ప్రస్తుత జిల్లాల సరిహద్దులతో పాటు కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా, గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటుచేయనున్నారు. 
 
ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మంత్రులతో జిల్లాల పునర్విభజనపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో పలు ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో, కూటమి ఇచ్చిన హామీలపై త్వరితగతిన నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలతో పాటు వివిధ సంఘాల వారిని భాగస్వాములను చేసి నివేదిక రూపొందించాలని ఆయన తెలిపారు.
 
మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా, పోలవరం ముంపు మండలాలు, ప్రత్యేక జిల్లాల ఏర్పాటు వంటి హామీలను అమలు చేసే అంశంపై చర్యలు వేగవంతం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు