ఈ రాఖీపండుగ రోజున లక్ష్మీ నారాయణుడిని పూజించి రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. రాఖీ పండుగ రోజున సౌభాగ్య యోగం కూడా ఏర్పడనుంది. ఇది ఆగస్టు 9వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉంటుంది. అనంతరం శోభన యోగం ఏర్పడుతుందట. అంతేకాకండా ఆగస్టు 9వ తేదీన ఉదయం 5:47 గంటల నుంచి మధ్యాహ్నం 2:23 గంటల వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది.
మరోవైపు శ్రవణ నక్షత్రం సైతం మధ్యాహ్నం 2:23 గంటల వరకు ఉంటుంది. ఇవన్నీ గమనిస్తే 95 ఏళ్ల తర్వాత రాఖీ పండుగ ఒకే తేదీ, ఒకే రోజు, ఒకే సమయం, ఒకే నక్షత్రం, ఒకే యోగాలు ఏర్పడటం గమనార్హం. అందుకే ఈ రోజున సత్యనారాయణ స్వామిని, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి.
పంచాగం ప్రకారం ఈ ఏడాది రాఖీ 2025 శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 8వ తేదీన మధ్యాహ్నం 2.12 గంటలకు ప్రారంభం అవుతుంది. అనంతరం ఆగస్టు 9న మధ్యాహ్నం 1.24 గంటలకు శ్రావణ పౌర్ణమి తిథి ముగుస్తుంది. కాబట్టి రాఖీ పండుగను ఆగస్టు 9వ తేదీన నిర్వహించుకుంటారు. కాబట్టి ఆగస్టు 9, 2025 శనివారం రాఖీ కట్టడానికి శుభ సమయం ఉదయం 5:47 నుండి మధ్యాహ్నం 1:24 వరకు. ఈ సమయంలో రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయి.