శ్రావణ పుత్రదా ఏకాదశిని గురువారం జరుపుకుంటున్నారు. ఉపవాసం, జాగరణతో విష్ణువును పూజించవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పుత్రదా ఏకాదశి ప్రతి సంవత్సరం రెండు పుత్రదా ఏకాదశిలు వస్తాయి. శ్రావణ పుత్రద ఏకాదశి శ్రావణ మాసంలో శుక్ల పక్షం 11వ రోజున ఆచరిస్తారు. ఇది ఆగస్టు 16కి అనుగుణంగా ఉంటుంది.
ఏకాదశి తిథి ప్రారంభం:
ఆగస్టు 15, 2024న 10:26 AM ప్రారంభమై
ఆగస్టు 16, 2024న 09:39 AMలకు ముగుస్తుంది.
పారణ సమయం: ఆగష్టు 17, 2024న
ఉదయం 05:28 AM నుండి 08:01 AM మధ్య
ద్వాదశి ముగింపు ముహూర్తం: ఆగష్టు 17, 2024న 08:05 AM
శ్రావణ పుత్రదా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత
ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించండం ద్వారా సర్వదా శుభం. సంతానం ఆశించే దంపతులకు శ్రావణ పుత్రదా ఏకాదశి శుభాలను ఇస్తుంది.
శ్రావణ పుత్రదా ఏకాదశిని పాటించేందుకు, భక్తులు తమ రోజును వేకువజామున స్నానంతో ప్రారంభిస్తారు. విష్ణుమూర్తిని పూజించాలి. నెయ్యితో దీపం వెలిగిస్తారు. విష్ణువుకు అంకితమైన మంత్రాలను పఠిస్తారు. తులసి పత్రాన్ని సమర్పించాలి. శ్రావణ పుత్రదా ఏకాదశికి సంబంధించిన కథను కూడా ఆచారాలలో భాగంగా పఠిస్తారు.