సోమవారం నాడు వచ్చే ప్రదోషాన్నే సోమవార ప్రదోషం అంటారు. ఈ ప్రదోష రోజున ఉపవాసం, శివుడిని పూజించడం వలన వివిధ దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరిస్తాయి. పురాణాలలో నిత్య ప్రదోషం, పక్ష ప్రదోషం, సోమవార ప్రదోషం, ప్రళయ ప్రదోషం ఇలా 20 రకాల ప్రదోషాలు ఉన్నాయి.
ఈ రోజున శివుడిని, ఆయన వాహనం నందిని పూజించడం విశేషం. ప్రదోష కాలంలో ఉపవాసం ఉండి శివాలయాల్లో జరిగే నంది అభిషేక ఆరాధన, ఈశ్వర పూజల్లో పాల్గొంటూ "నమశ్శివాయ" అనే మంత్రాన్ని జపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.