సాధారణంగా దంపతుల మధ్య అనుబంధం పెరిగేందుకు దాంపత్య జీవితం ఎంతగానో దోహదపడుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఒక వ్యక్తి ఎక్కువ కాలం పాటు దాంపత్య సుఖానికి దూరంగా ఉంటే దాని ప్రభావం పలు విధాలుగా ఉంటుందట. ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భార్యతో సంభోగంలో పాల్గొనకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని, శరీరంలో "శక్తి" పెరుగుతుందని కొంతమంది ఊహించుకుంటారు. అయితే, ఇది కేవలం అపోహా మాత్రమేనని సెక్సాలజిస్టులు అంటున్నారు.
ఇలాంటి వారిని దాంపత్య జీవితాన్ని చక్కగా అనుభవించే వారే మానసికంగా, శారీరకంగా మరింత శక్తివంతులుగా ఉంటారని వారు చెపుతున్నారు. సాధారణంగా మనిషిలో సెక్స్ కోరికలు సహజం. ఆ కోర్కెలను బలవంతంగా అదిమిపెడితే మానసికంగా చిక్కులు కలుగుతాయని వారు అంటున్నారు.
భార్య లేదా ప్రియురాలితో కొంతకాలం పాటు సెక్స్‌కు దూరంగా ఉండటం వల్ల నిద్ర తగ్గుతుందని, చికాకు పెరుగుతుందని, ఆదుర్దా అధికమవుతుందని, ఏకాగ్రత సమస్య తలెత్తుతుందని ఇలా అనేక సమస్యలు తలెత్తుతాయని వారు చెపుతున్నారు.
అందువల్ల మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ.. దాంపత్య సుఖానికి వచ్చే సరికి భార్యాభర్తలిద్దరూ కాస్త పట్టువిడుపులు ప్రదర్శించాల్సి వుంటుందని సెక్సాలిస్టులు హితవు పలుకుతున్నారు. భార్యాభర్తల్లో ఏ ఒక్కరైనా అయిష్టత ప్రదర్శిస్తే మాత్రం బలవంతం చేయరాదని వారు చెపుతున్నారు.